ఓవర్ లోడింగ్ నియంత్రణ చేయాలి.లారి అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దన్న. బళ్ళారి(5)లారిలకు ఓవర్ లోడింగ్ చేయడం ద్వారా ఇతర లారిలకు లోడింగ్ దొరకడం లేదు అని దీనిద్వారా మిగిలిన లారి యజమానులు బ్రతుకులు రోడ్లపై వస్తున్నాయి అనిఆవేదన వ్యక్తపరిచారు.
బళ్ళారి నగరంలో మూడు రోజులు నుండి ఆర్ టి ఓ కార్యాలయం ముందు లారి అసోసియేషన్ ప్రెసిడెంట్ పెద్దన్న అధ్వర్యంలో ధర్న చేస్తున్నారు.
ఇప్పటికే లారిఫిల్డ్ కు సంపూర్ణంగా ఆర్థికంగా దెబ్బలు తగిలాయి అని,బాకిలు కట్ట లేక పోతున్నారు, ఇటువంటి సమయంలో బయట ప్రాంతం వారు లోకల్ వాళ్ళు, ఓవర్ లోడు చేయడం వలన రెండు లారిలలో వేళ్ళ వలసిన సరకు ఒకే లారిలో వేళ్ళు తుంది,దీనిద్వారా ఇతర లారిలకు లోడింగ్ దొరకడం లేదు అని, ఆవేదన వ్యక్తం చేసారు.
ఇప్పటికే ఎన్నో సార్లు అధికారుల దృష్టి కి తీసుకువచ్చిన ఎటువంటి చర్యలు తీసుకోలేదు అందువలన, ఓవర్ లోడు నియంత్రణ చేసేవరకూ కార్యాలయం ముందు దర్న చేస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రముఖులు అందరూ పాల్గొన్నారు.
[video width="960" height="540" mp4="https://news9today.in/wp-content/uploads/2023/10/VN20231005_184035.mp4"][/video]