This is the title of the web page
This is the title of the web page

Please assign a menu to the primary menu location under menu

State

తుంగభద్ర వరద నీటి వినియోగానికి సమాంతర కాలువ నిర్మించాలి: సిపిఐ డిమాండ్

తుంగభద్ర వరద నీటి వినియోగానికి సమాంతర కాలువ నిర్మించాలి: సిపిఐ డిమాండ్

​తుంగభద్ర వరద నీటి వినియోగానికి సమాంతర కాలువ నిర్మించాలి: సిపిఐ డిమాండ్

​బళ్లారి. ఆగస్టు( 27)

తుంగభద్ర జలాశయం నుంచి ప్రతి ఏటా సముద్రం పాలవుతున్న వరద నీటిని సద్వినియోగం చేసుకునేందుకు సమాంతర వరద కాలువను వెంటనే నిర్మాణం చేయాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల పరస్పర ప్రయోజనాల కోసం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయమై తక్షణమే చర్చలు జరిపి చర్యలు చేపట్టాలని కోరారు.

గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్. బళ్లారి జిల్లా సిపిఐ పార్టీ కార్యదర్శి ఆదిమూర్తి. బళ్లారి జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి కట్టేబసప్ప

మాట్లాడారు.

​సమాంతర కాలువ నిర్మాణం: 2019 నుంచి వరుసగా డ్యామ్ నిండి లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి, శ్రీశైలం ప్రాజెక్టు మీదుగా కృష్ణా నదిలోకి వృథాగా పోతోందని తెలిపారు. ప్రస్తుతం ఏలినినో ప్రభావం వల్ల తీవ్ర వర్షాభాగం నెలకొని తాగునీటికి సాగునీటికి తీవ్రమైన కష్టాలు ఏర్పడినాయి. ఇలాంటి పరిస్థితుల్లో సముద్రం లేకపోయే నీటిని తుంగభద్ర జలాశయం నుండి వరద కాలమును ఏర్పాటు చేసుకుంటే, వాటిని నిలువ చేసుకొని ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నీటిని వాడుకునే దానికి అవకాశం ఉంటుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రితో వరద సమాంతర కాల్వపైన చర్చలు కూడా జరిపింది. కానీ అప్పటి ముఖ్యమంత్రి స్పందించినందువల్ల ఆ చర్య ముందుకు సాగలేదు. ప్రస్తుతం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా కర్ణాటక కు ఉన్నందువల్ల, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యపై చర్చలు జరపాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. డ్యామ్‌లో పూడిక తీయడం సాధ్యం కాదని నిపుణులు తేల్చిచెప్పినందున, సమాంతర కాలువ తవ్వడమే ఏకైక మార్గమని స్పష్టం చేశారు. దీనివల్ల అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు జిల్లాలతో పాటు కర్ణాటక ప్రాంతాలకూ తాగు, సాగునీరు అందుతుందని పేర్కొన్నారు.

​బళ్లారి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్:

బళ్లారి సమీపంలోని చాగనూరు, సిరివరం గ్రామాల్లో గతంలో సేకరించిన 900 ఎకరాల భూమిలో వెంటనే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. దీనివల్ల వ్యాపారవేత్తలు, విదేశాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు మరియు ప్రాంతీయ రవాణాకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

​కుడేరులో కార్గో ఎయిర్‌పోర్ట్ ఎయిర్పోర్టును నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ అనంతపురం హిందూపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పార్థసారథి గార్లు విమానయనా శాఖ మంత్రితో చర్చలు కూడా జరిపి కార్గో ఎయిర్పోర్ట్ వల్ల రాయలసీమ లో పండించే అనేక రకాల పండ్ల రైతులకు ఉపయోగపడుతుందని వారు కార్గో ఏర్పోర్ట్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఆ పనులు ప్రారంభం కాలేదు అందువల్ల కేంద్ర ప్రభుత్వం కార్గో విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు : అనంతపురం జిల్లా కుడేరు మండలంలో పండించే వివిధ రకాల పండ్ల ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా కార్గో ఎయిర్‌పోర్ట్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు

​ఈ సమస్యలపై ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వినతిపత్రాలు సమర్పిస్తామని, రెండు రాష్ట్రాల సిపిఐ శాఖలు ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని నాయకులు హెచ్చరించారు.


News 9 Today

Leave a Reply